అమిత్‌షాను కలిసి.. కేసీఆర్‌పై కంప్లైంట్ చేసిన ఎంపీ అర్వింద్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కలిశారు. గురువారం ఢిల్లీలో హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదు చేశారు. భైంసాకి చెందిన నలుగురు యువకులను అన్యాయంగా 9 నెలల నుంచి చంచల్ గూడలో పెట్టారని, మరో 11 మంది కార్యకర్తలను 20 కిలోమీటర్ల రేడియస్ లో నిషేధించారని అమిత్ షాకు నివేదించినట్టు ఎంపీ తెలిపారు. మజ్లిస్ కు […]

Update: 2021-12-09 08:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ కలిశారు. గురువారం ఢిల్లీలో హోం మంత్రిని కలిసి రాష్ట్రంలో టీఆర్ఎస్ హయాంలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదు చేశారు. భైంసాకి చెందిన నలుగురు యువకులను అన్యాయంగా 9 నెలల నుంచి చంచల్ గూడలో పెట్టారని, మరో 11 మంది కార్యకర్తలను 20 కిలోమీటర్ల రేడియస్ లో నిషేధించారని అమిత్ షాకు నివేదించినట్టు ఎంపీ తెలిపారు. మజ్లిస్ కు భయపడి, ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ కేవలం హిందువులపై చేస్తున్న దాష్టీకాలను కేంద్ర మంత్రికి వివరించానని, వారు పరిగణలోకి తీసుకున్నారని ఎంపీ తెలిపారు.

Tags:    

Similar News