ఆమె అక్కడే చనిపోయింది
దిశ, నిజామాబాద్: కరోనా కారణంగా అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై భానుడు ఏ మాత్రం దయ చూపడంలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాడు. జిల్లాలో వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. చందూర్ మండల కేంద్రంలోని గ్రామ ఉరచెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనిలో వడదెబ్బతో బర్ల సాయమ్మ(55) అనే మహిళ మృతి చెందింది. గత కోన్ని రోజులుగా జరుగుతున్న ఉపాధి పనుల్లో ఆమె పని చేస్తుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పనికి వచ్చిన […]
దిశ, నిజామాబాద్: కరోనా కారణంగా అష్టకష్టాలు పడుతున్న ప్రజలపై భానుడు ఏ మాత్రం దయ చూపడంలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాడు. జిల్లాలో వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. చందూర్ మండల కేంద్రంలోని గ్రామ ఉరచెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనిలో వడదెబ్బతో బర్ల సాయమ్మ(55) అనే మహిళ మృతి చెందింది. గత కోన్ని రోజులుగా జరుగుతున్న ఉపాధి పనుల్లో ఆమె పని చేస్తుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పనికి వచ్చిన సాయమ్మ పని చేస్తుండగానే కుప్పకూలింది. అక్కడ అమెను పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. అదివారం అత్యధిక ఎండలు 45 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఉపాధి పనుల దగ్గర కూలీలకు ఎండనుంచి కాపాడే టెంట్లు గానీ, అత్యవసర కిట్లు గానీ అందుబాటులో లేవు. అయితే.. బర్ల సాయమ్మ గుండెపోటుతో మృతి చెందిందని ఎంపీడీవో నీలావతి తెలిపారు.