కరోనా కట్టడికి సహకరించాలి : కలెక్టర్ శరత్

దిశ, నిజామాబాద్: కరోనాకట్టడికి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ శరత్ కోరారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన దేవునిపల్లిలో శనివారం పర్యటించారు. స్థానిక పరిస్థితి గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరికైనా వ్యాధిపై అనుమానం ఉంటే స్వచ్ఛందంగా ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ […]

Update: 2020-04-10 23:01 GMT

దిశ, నిజామాబాద్: కరోనాకట్టడికి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని జిల్లా కలెక్టర్ శరత్ కోరారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన దేవునిపల్లిలో శనివారం పర్యటించారు. స్థానిక పరిస్థితి గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎవరికైనా వ్యాధిపై అనుమానం ఉంటే స్వచ్ఛందంగా ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దోతురే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తాసిల్దార్ అమీన్ సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags: NIzamabad,collector Sharath,visit devunipally

Tags:    

Similar News