నిజామాబాద్‌లో గెలిచి.. బీజేపీకి బహుమతి ఇస్తా
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల కోసం జరిగే ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పోతన్కార్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచి బీజేపీకి బహుమతి ఇస్త’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను అధికార టీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల కోసం జరిగే ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పోతన్కార్ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచి బీజేపీకి బహుమతి ఇస్త’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలను అధికార టీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధుల ద్వారానే స్థానిక సంస్థలు నడుస్తున్నాయన్నారు. ఇదే ప్రచారం అస్త్రంగా ప్రజా ప్రతినిధులు ఏకం చేసి గెలుస్తనని ధీమా వ్యక్తం చేసారు. అంతకు ముందు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు వెంటరాగా నామినేషన్ వరకు ర్యాలీ తీశారు. ర్యాలీలో కార్పొరేటర్, కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Tags : Nizamabad, BJP MLC candidate, press meet, laxmi narayana, namination, TRS