నవదీప్ సైనీపై నెటిజన్ల విమర్శలు
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ పేసర్ నవదీప్ సైనిని నెటిజన్లు తీవ్ర విమర్శలతో ముంచెత్తారు. హార్లీ డేవిడ్‌సన్ బైక్ మీద కూర్చొని ఒక మట్టి రోడ్డులో అత్యంత వేగంతో దుమ్మరేపుతా నడిపిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చొండి’ అంటూ వీడియోకు కామెంట్ కూడా జత చేశాడు. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు సైనీని ఒక ఆట ఆడుకున్నారు. ఒక క్రికెటర్ అయ్యుండి ఇలాగేనా అభిమానులకు […]
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ పేసర్ నవదీప్ సైనిని నెటిజన్లు తీవ్ర విమర్శలతో ముంచెత్తారు. హార్లీ డేవిడ్‌సన్ బైక్ మీద కూర్చొని ఒక మట్టి రోడ్డులో అత్యంత వేగంతో దుమ్మరేపుతా నడిపిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చొండి’ అంటూ వీడియోకు కామెంట్ కూడా జత చేశాడు. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు సైనీని ఒక ఆట ఆడుకున్నారు. ఒక క్రికెటర్ అయ్యుండి ఇలాగేనా అభిమానులకు సందేశం ఇచ్చేది.. ముందుగా క్రికెట్ మీద ధ్యాసపెట్టి కష్టపడమని సలహా ఇస్తున్నారు.
అంతే కాకుండా భారత జట్టుకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే ఇలా వ్యవహరిస్తే ఎలా గంటూ చురకలంటించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ వీడియోను చూసి ఫైన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ యువకులు ఎవరైనా ఇలా చేస్తే అధికారులు చూస్తూ ఊరుకుంటారాన అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సైనీ స్టంట్‌ను అభిమానిస్తూ మరి కొంత మంది కామెంట్లు చేశారు.