త్వరలో భారత మార్కెట్లోకి నిస్సాన్ ఎలక్ట్రిక్ కారు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో సగం ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండనున్నట్టు వెల్లడించింది. తద్వారా కర్బన ఉద్గారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపింది. భారత్‌లొ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు పెరుగుతున్న గిరాకీని గమనిస్తున్నాం. వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో జరుగుతోందని నిస్సాన్ మోటార్ కంపెనీ సీఈఓ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో సగం ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండనున్నట్టు వెల్లడించింది. తద్వారా కర్బన ఉద్గారాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపింది. భారత్‌లొ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు పెరుగుతున్న గిరాకీని గమనిస్తున్నాం. వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో జరుగుతోందని నిస్సాన్ మోటార్ కంపెనీ సీఈఓ మకొటా ఉచిడా అన్నారు.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం. సరైన సమయంలో, సరైన ఉత్పత్తులతో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులు, వినియోగదారుల స్పందన వంటి కీలక అంశాలపై కసరత్తు చేస్తోందన్నారు.