విశాఖ ఉక్కుపై మరోసారి లోక్‌సభలో నిర్మలా ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు కారణమని, విశాఖ ఉక్కు నష్టాలకు అప్పులపై అధికవడ్డీ కారణమని వ్యాఖ్యానించారు. నష్టాలకు తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యం కారణమన్నారు. ప్రైవేటీకరణతో వచ్చే వనరులను అభివృద్ధికి వినియోగిస్తామని, సామాజిక, అభివృద్ధి పనులకు వినియోగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని నిర్మలా స్పష్టం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు నష్టాలకు ప్రత్యక్ష, పరోక్ష వ్యయాలు కారణమని, విశాఖ ఉక్కు నష్టాలకు అప్పులపై అధికవడ్డీ కారణమని వ్యాఖ్యానించారు. నష్టాలకు తక్కువ ఉత్పాదకత, వినియోగ సామర్థ్యం కారణమన్నారు.
ప్రైవేటీకరణతో వచ్చే వనరులను అభివృద్ధికి వినియోగిస్తామని, సామాజిక, అభివృద్ధి పనులకు వినియోగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రైవేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదని నిర్మలా స్పష్టం చేశారు.