‘వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అంతా సిద్ధం’

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 7 నుంచి వ్యాక్సిన్‌ ట్రయల్స్ చేసేందుకు అంతా సిద్ధమని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. ఫేజ్ -1, ఫేజ్ -2 కింద ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి ఫేజ్ దాదాపు 28 […]

Update: 2020-07-04 04:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 7 నుంచి వ్యాక్సిన్‌ ట్రయల్స్ చేసేందుకు అంతా సిద్ధమని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తెలిపారు. ఫేజ్ -1, ఫేజ్ -2 కింద ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే వ్యాక్సిన్ తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తామని.. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి ఫేజ్ దాదాపు 28 రోజుల పాటు నిర్వహిస్తామని నిమ్స్ డైరెక్టర్ వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News