"నేను గానీ ఒకే అనుంటే.. ఏపీ కరోనా హాట్‌స్పాట్‌గా మారేది"
తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఉంటే ఇప్పుడు ఏపీ కరోనాకి హాట్‌స్పాట్‌గా ఉండేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వెల్లడించారు. తనను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ న్యాయస్థానానికి పరిస్థితి తెలిపే ప్రయత్నం చేశారు. దాని […]
తాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ఉంటే ఇప్పుడు ఏపీ కరోనాకి హాట్‌స్పాట్‌గా ఉండేదని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వెల్లడించారు. తనను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆర్డినెన్స్ తేవడంపై ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ న్యాయస్థానానికి పరిస్థితి తెలిపే ప్రయత్నం చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే…
నిష్పక్షపాతంగా పని చేస్తుంటే, ఏపీ ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదులు రాగా, తాను నివేదికలు కోరడమే తప్పైందని ఆయన పేర్కొన్నారు. ఆర్డినెన్స్ తరువాత ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై వెంటనే స్టే విధించాలని హైకోర్టును కోరారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని, సర్వీస్ నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
నిన్న సాయంత్రం హైకోర్టులో ఆయన ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, ఏపీలో అలాంటి పరిస్థితి లేకున్నా, తనను తప్పించాలన్న ఉద్దేశంతోనే జీవో తెచ్చారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. ఆర్డినెన్స్‌ల జారీలో అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తన పిటిషన్ లో గుర్తు చేసిన నిమ్మగడ్డ, సీఎం అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేయడం తన తప్పయి పోందని అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఎన్నికల కమిషనర్ తొలగింపునకు రాజ్యాంగంలోని నిర్దేశిత విధానాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆయన ఆరోపించారు.
ఇదిలావుండగా, ఎస్ఈసీ పదవీ కాలాన్ని తగ్గిస్తూ, ఆర్డినెన్స్ తేవడం, ఆ వెంటనే నిమ్మగడ్డను తొలగించి, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజును ఆ పదవిలో నియమించడాన్ని సవాల్ చేస్తూ, రమేష్ కుమార్‌తో పాటు, ప్రకాశం జిల్లా న్యాయవాది తాండవ యోగేశ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు కూడా హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయడం విశేషం.
Tags: nimmagadda ramesh kumar, sec, high court, amaravathi, emergency petition