Srikakulam: రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లు.. ఎగబడిన స్థానికులు
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డుపై వ్యాన్ నుంచి జారి పడిన మద్యం బాటిళ్లను జనం ఎగబడి తీసుకెళ్లారు...
దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ వస్తే ఏదీ తీసుకోవద్దనేది పెద్దలు చెబుతుంటారు. కానీ మద్యం విషయంలో ఈ మాటలేవీ పనికి రావనేది సత్యం. ఉచిత పథకాలకు అలవాటు పడిన జనమేకాదు.. డబ్బులున్న వాళ్లు కూడా మద్యం ఊరికే వస్తుందంటే ఊరుకుంటారా.. ఎగబడి మరి తీసుకుంటారు. ప్రమాదం జరగడం వల్ల వచ్చిన మద్యం అని తెలిసినా వదిలిపెట్టరు. వీలు కుదిరితే మద్యం కేసులను ఎత్తుకెళ్లి హ్యాపీగా తాగేస్తారు. కుదరకపోతే ఒక బాటిళ్‌తో సర్దుకుంటారు.
ఇలాంటి ఘటన బుధవారం శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో జరిగింది. మద్యం బాటిళ్ల లోడ్(liquor bottles Loads )తో వ్యాన్(Van) శ్రీకాకుళం నుంచి పలాసకు హైవేపై వెళ్తోంది. అయితే కొత్తపారసంబ వద్ద వెనుక డోర్ ఓపెన్ అయి మద్యం బాటిళ్ల కేసులు కింద పడ్డాయి. దీన్ని గమనించకుండా డ్రైవర్లనముందుకు వెళ్లిపోయారు. వ్యాన్ శాసనం దగ్గరకు వెళ్లగానే మరోసారి మద్యం బాటిళ్ల బాక్సులు జారీ కింద పడ్డాయి. దీంతో మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు. కొందరు కాటన్లు తీసుకెళ్లగా మరికొందరు బాటిళ్లు జేబులో పెట్టుకుని తీసుకెళ్లారు. దీంతో వ్యాన్ డ్రైవర్ ఉసూరుమన్నారు.