టూల్‌కిట్ కేసులో నికితా జాకబ్‌కు ఊరట..
ముంబయి : పర్యావరణ కార్యకర్త ‘గ్రేటా థన్‌బర్గ్ టూల్‌కిట్’ కేసులో న్యాయవాది నికితా జాకబ్‌కు ఊరట లభించింది. ఆమెకు బుధవారం బాంబే హైకోర్టు మూడు వారాల ట్రాన్సిట్ యాంటిస్పేటరీ బెయిల్‌ను మంజూరు చేసింది. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులో నికితా జాకబ్‌ను అరెస్టు చేయకుండా రూ.25వేల సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అరెస్టు నుంచి రక్షణ నేటి(బుధవారం) నుంచి మూడు వారాలపాటు మంజూరు చేస్తున్నామని, అప్పటిలోగా సంబంధిత […]
ముంబయి : పర్యావరణ కార్యకర్త ‘గ్రేటా థన్‌బర్గ్ టూల్‌కిట్’ కేసులో న్యాయవాది నికితా జాకబ్‌కు ఊరట లభించింది. ఆమెకు బుధవారం బాంబే హైకోర్టు మూడు వారాల ట్రాన్సిట్ యాంటిస్పేటరీ బెయిల్‌ను మంజూరు చేసింది. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ నమోదు చేసిన నాన్ బెయిలబుల్ కేసులో నికితా జాకబ్‌ను అరెస్టు చేయకుండా రూ.25వేల సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అరెస్టు నుంచి రక్షణ నేటి(బుధవారం) నుంచి మూడు వారాలపాటు మంజూరు చేస్తున్నామని, అప్పటిలోగా సంబంధిత న్యాయస్థానంలో అవసరమైన రక్షణను కోరవచ్చునని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. నికితా జాకబ్ పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
నికితా జాకబ్ పిటిషన్‌పై మంగళవారం బాంబే హైకోర్టు తీర్పు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనలపై పర్యావరణ కార్తకర్త గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేసిన టూల్‌కిట్‌ను తయారు చేసిన వారిలో నికితా జాకబ్, శాంతాను ములుక్ కూడా ఉన్నారని సోమవారం ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. నికితపైన దేశ ద్రోహం, వివిధ సమూహాల మధ్య శత్రుత్వం ప్రోత్సహించడం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.