నష్టాల వలలో మార్కెట్లు!

దేశీయ మార్కెట్లకు కరోనా కష్టాలు తప్పట్లేదు. అంతర్జాతీయంగా కఓనా విలయతాండవంతో ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దేశీయనంగా కూడా కరోనా వ్యాప్తి విస్తరిస్తుండటం మార్కెట్ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. గత వారం నిలకడగా రాణించిన తర్వాత సోమవారం ప్రారంభమే వెయ్యి పాయింట్లను కోల్పోయి నష్టాలను కొనసాగిత్స్తున్నాయి. గతవారం లాభాల్లో ఉన్న బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు సైతం ఈ వారం ప్రారంభంలోనే నష్టాలను చవిచూశాయి. మిగిలిన రంగాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉదయం పది గంటల […]

Update: 2020-03-29 23:17 GMT

దేశీయ మార్కెట్లకు కరోనా కష్టాలు తప్పట్లేదు. అంతర్జాతీయంగా కఓనా విలయతాండవంతో ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. దేశీయనంగా కూడా కరోనా వ్యాప్తి విస్తరిస్తుండటం మార్కెట్ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. గత వారం నిలకడగా రాణించిన తర్వాత సోమవారం ప్రారంభమే వెయ్యి పాయింట్లను కోల్పోయి నష్టాలను కొనసాగిత్స్తున్నాయి. గతవారం లాభాల్లో ఉన్న బ్యాంకింగ్, ఫార్మా రంగాల షేర్లు సైతం ఈ వారం ప్రారంభంలోనే నష్టాలను చవిచూశాయి. మిగిలిన రంగాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ 445.21 పాయింట్ల నష్టంతో 29,370 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 128.65 పాయింట్లను కోల్పోయి 8,531 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్, నెస్లె ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు స్వల్పంగా లాభాలతో కొనసాగుతుండగా, మిగిలిన సూచీలన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Tags : sensex, nifty, BSE, NSE, stock market

Tags:    

Similar News