12 వేల దిగువకు నిఫ్టీ!

అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రతికూల ప్రభావం ఒకవైపు, మార్చి త్రైమాసిక లక్ష్యాల్ని చేరుకునే అవకాశాలు లేవని యాపి ప్రకటనతో ఆసియా మార్కెట్ల పతనం మరోవైపు…దేశీయంగా మార్కెట్ల సూచీని భయపెడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్ల భారీ నష్టాన్ని చూసింది. నిఫ్టీ సైతం 12 వేల దిగువకు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 228.65 పాయింట్ల నష్టంతో 40,853 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54.75 పాయింట్లను కోల్పోయి 11,991 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లోని అన్ని రంగాలు నష్టాల బాటలో […]

Update: 2020-02-18 04:47 GMT

అంతర్జాతీయంగా మార్కెట్ల ప్రతికూల ప్రభావం ఒకవైపు, మార్చి త్రైమాసిక లక్ష్యాల్ని చేరుకునే అవకాశాలు లేవని యాపి ప్రకటనతో ఆసియా మార్కెట్ల పతనం మరోవైపు…దేశీయంగా మార్కెట్ల సూచీని భయపెడుతున్నాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్ల భారీ నష్టాన్ని చూసింది. నిఫ్టీ సైతం 12 వేల దిగువకు పతనమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 228.65 పాయింట్ల నష్టంతో 40,853 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 54.75 పాయింట్లను కోల్పోయి 11,991 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్లోని అన్ని రంగాలు నష్టాల బాటలో కొనసాగి…లంచ్ తర్వాత కాస్త కోలుకున్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫోసిసి, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్లోనే కదుల్తున్నాయి. అయితే, మూడురోజులుగా నష్టపోతున్న మారెక్ట్లు ఈరోజు మధ్యాహ్నం తర్వాత నెమ్మదిగా తక్కువ నష్టంలో ట్రేడవుతున్నాయి. మార్కెట్లు ముగిసే చివరి గంట ట్రేడింగ్‌కు కీలకం అవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏజీఆర్ చెల్లింపుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల ఆందోళన కారణంగా ఎయిర్‌టెల్ 4 శాతం నష్టాన్ని చూడగా, వొడాఫోన్ ఐడియా భారీ స్థాయిలో 15 శాతం నష్టాలతో ట్రేడవుతోంది.

Tags:    

Similar News