మార్కెట్లను వీడని కరోనా భయం!

ముంబయి: దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలత రావడం, దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో సోమవారం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. చైనాలో‌ రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆ భయాలు మన మార్కెట్‌పైనా ప్రభావం చూపాయి. ఈక్విటీ‌ మార్కెట్లు ఉదయం నుంచే ట్రేడింగ్‌ను నష్టాల్లో ప్రారంభించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టాలను నమోదు చేయగా, నిఫ్టీ 96 పాయింట్లు పతనమైంది. నష్టాలు కొనసాగడంతో మార్కెట్లు […]

Update: 2020-06-15 06:31 GMT

ముంబయి: దేశీయ మార్కెట్లకు నష్టాలు తప్పడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూలత రావడం, దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో సోమవారం దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌ బలహీనపడింది. చైనాలో‌ రెండోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆ భయాలు మన మార్కెట్‌పైనా ప్రభావం చూపాయి. ఈక్విటీ‌ మార్కెట్లు ఉదయం నుంచే ట్రేడింగ్‌ను నష్టాల్లో ప్రారంభించాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టాలను నమోదు చేయగా, నిఫ్టీ 96 పాయింట్లు పతనమైంది. నష్టాలు కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 552.09 పాయింట్లు కోల్పోయి 33,228 వద్ద ముగియగా, నిఫ్టీ 159.20 పాయింట్లు నష్టపోయి 9,813 వద్ద ముగిసింది. రంగాలవారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ, ఆటో రంగాలు నష్టాల్లో ట్రేడవ్వగా, మీడియా, ప్రభుత్వరంగ బ్యాంకులు కొంత మేరకు లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, హెచ్‌సీఎల్, సన్‌ఫార్మా, ఓన్‌జీసీ సూచీలు మాత్రమే లాభాలను చూడగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.02గా ఉంది.

Tags:    

Similar News