Shantikanta Das: క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి భారీ ముప్పు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

క్రిప్టో కరెన్సీల(Crypto currency)పై రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor Shantikanta Das) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-26 15:53 GMT

దిశ, వెబ్ డెస్క్: క్రిప్టో కరెన్సీల(Crypto currency)పై రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్(RBI Governor Shantikanta Das) కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక సుస్థిరత(Financial Sustainability), ద్రవ్య లభ్యత(Financial Availability)కు భారీ ముప్పు పొంచి ఉందని, క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థలోకి మనీ చలామణిపై ఆర్బీఐ నియంత్రణ కోల్పోయే పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్(Peterson Institute of International Economics) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో శక్తికాంత దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'క్రిప్టోలు ఆర్ధిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని చెలాయించకూడదని, క్రిప్టోకరెన్సీలతో ముడిపడి ఉన్న భారీ నష్టాలను పూర్తిగా దృష్టిలో ఉంచుకుని, ఈ సమస్యపై అంతర్జాతీయ అవగాహన ఉండాలన్నారు. ఇది ప్రోత్సహించాల్సిన విషయం కాదని నేను భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకు(Central Bank)లకు ఇది ప్రధాన ఆందోళనని, క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా ఎక్కువగా తెలుసుకుంటున్నాయని దాస్ తెలిపారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నలను లేవనెత్తిన మొదటి దేశం భారత్(India) అని ఆయన అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్(G20 Summit)లో క్రిప్టో కరెన్సీలపై ఎలా వ్యవహరించాలనే దానిపై అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడానికి ఒక ఒప్పందం కుదిరిందని, ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Tags:    

Similar News