Indigo Q2 Results: రెండో త్రైమాసికంలో భారీగా నష్టపోయిన ఇండిగో ఎయిర్ లైన్స్

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

Update: 2024-10-26 15:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(Indigo) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో(Q2FY25) కంపెనీ రూ. 986.7 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. కాగా గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ. 188.9 కోట్ల లాభాలను ఆర్జించడం విశేషం. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం 14.6 శాతం వృద్ధి చెంది రూ. 17,800 కోట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్(CEO Peter Elbers) ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని విమానాలను నిలిపివేయడం, అలాగే ఇంధన ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల కంపెనీ నష్టాలపై ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ చివరి వరకు ఇండిగో వద్ద 410 విమానాలున్నాయని, ఈ త్రైమాసికంలో ఇండిగో విమానాల ద్వారా 2 కోట్ల 78 లక్షల మంది ప్రయాణించారని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ గౌరవ్ నేగి(CFO Gaurav Negi) తెలిపారు. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఈ సారి దాదాపు 6 శాతం ఎక్కువ మంది ట్రావెల్ చేసారని వెల్లడించారు.

Tags:    

Similar News