అక్రమ గుడిసెలను తొలగించిన రెవెన్యూ అధికారులు..

ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామం సమీపంలో రెవెన్యూ భూమి అయిన 17 సర్వేనెంబర్ సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి శనివారం గుడిసెలను తొలగించారు.

Update: 2024-10-26 15:11 GMT

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామం సమీపంలో రెవెన్యూ భూమి అయిన 17 సర్వేనెంబర్ సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించుకున్న గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి శనివారం గుడిసెలను తొలగించారు. గతంలో ప్రభుత్వం ఉద్యానవన శాఖకు ఈ భూమిని కేటాయించగా మళ్లీ ఇటీవల ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవనాల సముదాయం కోసం అధికారులు కేటాయించారు. రెవెన్యూ అధికారులు ఈ ప్రదేశంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాల పనులు ప్రారంభించిన సందర్భంలో స్థలాన్ని వారికి అప్పగించాలని, అక్రమంగా నివాసం ఉంటున్న సుమారు 150 గుడిసెలను శనివారం పోలీసు భద్రత మధ్య జేసీబీ లను, ట్రాక్టర్లను ఉపయోగించి తొలగించారు. గుడిసెలు తొలగింపు సమయంలో పోలీసులకు, గుడిసె వాసులకు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.


Similar News