SBI-Solex Energy: సోలార్ ప్రాజెక్ట్‌లకు లోన్స్.. ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సోలెక్స్ ఎనర్జీ

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుజరాత్(Gujarath) రాష్ట్రానికి చెందిన సోలార్ మాడ్యూల్(Solar Module) తయారీ కంపెనీ సోలెక్స్ ఎనర్జీ(Solex Energy) మధ్య కీలక భాగస్వామ్యం కుదిరింది.

Update: 2024-10-26 13:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) గుజరాత్(Gujarath) రాష్ట్రానికి చెందిన సోలార్ మాడ్యూల్(Solar Module) తయారీ కంపెనీ సోలెక్స్ ఎనర్జీ(Solex Energy) మధ్య కీలక భాగస్వామ్యం కుదిరింది. వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్లకు సోలార్ ఫైనాన్సింగ్ ఎంపికలను అందించడాని ఎస్‌బీఐతో జత కట్టినట్లు సోలెక్స్ ఎనర్జీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా.. ఎస్‌బీఐ భారతదేశం(India) అంతటా తన సూర్య శక్తి సోలార్ ఫైనాన్స్(Surya Shakti Solar Finance) పథకం కింద సోలార్ ప్రాజెక్ట్‌ల కోసం రూ. 10 కోట్ల వరకు రుణాలను అందించనుందని సోలెక్స్ ఎనర్జీ ఒక ప్రకటనలో తెలిపింది. సౌరశక్తిని తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడానికి, వ్యాపార విస్తరణను వేగవంతం చేయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుందని సోలెక్స్ ఎనర్జీ ఛైర్మన్(Chairman)& మేనేజింగ్ డైరెక్టర్ (MD) చేతన్ షా(Chetan Shah) తెలిపారు. ఈ సర్వీసులో భాగంగా సోలెక్స్ ఎనర్జీ కస్టమర్లకు ఎండ్-టు-ఎండ్ సపోర్ట్‌ను అందిస్తుందని, సైట్ ఎంపిక, డిజైన్ నుంచి రెగ్యులేటరీ అనుమతులు పొందడం వరకు సేవలను అందిస్తుందని వెల్లడించారు. కాగా సూరత్‌లో ఉన్న సోలెక్స్ ఎనర్జీ తన సోలార్ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని 700 మెగావాట్ల (MW) నుండి 1.5 గిగావాట్లకు (GW) విస్తరించే ప్రక్రియలో ఉంది. అందులో భాగంగానే ఎస్‌బీఐతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News