ఆ కేసులో 8 మంది పై ఎన్‌ఐఏ చార్జిషీట్

ముంబయి: భీమా కోరేగావ్ కేసులో తాజాగా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చార్జిషీటు వేసింది. 2018 జనవరి 1న పూణెలో హింసకు ప్రేరేపించారన్న అభియోగాల కింద జర్నలిస్టు గౌతం నవలఖా, ఫాదర్ స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై ముంబయి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో నవలఖా, స్టాన్ స్వామితోపాటు ఢిల్లీ యూనివర్సిటీ అసొసియేట్ ప్రొఫెసర్ హనిబాబు, గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబ్డే, యాక్టివిస్టులు జ్యోతి జగ్‌తాప్, […]

Update: 2020-10-09 09:04 GMT

ముంబయి: భీమా కోరేగావ్ కేసులో తాజాగా ఎనిమిది మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చార్జిషీటు వేసింది. 2018 జనవరి 1న పూణెలో హింసకు ప్రేరేపించారన్న అభియోగాల కింద జర్నలిస్టు గౌతం నవలఖా, ఫాదర్ స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై ముంబయి కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో నవలఖా, స్టాన్ స్వామితోపాటు ఢిల్లీ యూనివర్సిటీ అసొసియేట్ ప్రొఫెసర్ హనిబాబు, గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబ్డే, యాక్టివిస్టులు జ్యోతి జగ్‌తాప్, సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్‌, మిలింద్ తేల్‌తుంబ్డేల పేర్లున్నాయి.

ఇందులో మిలింద్ తేల్‌తుంబ్డే అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో తాజాగా గురువారం రాత్రి రాంచీలోని తన నివాసం నుంచి స్టాన్ స్వామిని పోలీసులు అరెస్టు చేసి ముంబయికి తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచారు. స్వామిని ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలోకి కోర్టు పంపింది. స్టాన్ స్వామి ఇతర కుట్రదారులు సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, అరుణ్ ఫరేరా, వెర్నన్ గోంజాల్వేజ్, హనిబాబు, షోమా సేన్, మహేష్ రౌత్, వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతం నవలఖా, ఆనంద్ తేల్‌తుంబ్డేలతో టచ్‌లో ఉన్నారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ కేసులో స్వామి అరెస్టు 16వది కావడం గమనార్హం.

Tags:    

Similar News