బంగ్లాదేశ్ పర్యటన వాయిదా వేసిన కివీస్
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రపంచ టెస్టు క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లను ఇరు జట్లు ఆడాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటనకు తమ ఆటగాళ్లను పంపడం సాధ్యం కాదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సమాచారం అందించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) ద్వైపాక్షిక సిరీస్‌ను నిరవదికంగా వాయిదా వేసింది. ‘మేం […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా మరో ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడింది. ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ప్రపంచ టెస్టు క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లను ఇరు జట్లు ఆడాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటనకు తమ ఆటగాళ్లను పంపడం సాధ్యం కాదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సమాచారం అందించడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) ద్వైపాక్షిక సిరీస్‌ను నిరవదికంగా వాయిదా వేసింది. ‘మేం ఈ సిరీస్ నిర్వహించడానికి ఇప్పుడు సిద్ధంగా లేం. దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆగస్టులో పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేయలేం. అదేవిధంగా కివీస్ ఆటగాళ్లు కూడా ఇక్కడకు రావడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందుకే, ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను నిరవదికంగా వాయిదా వేస్తున్నాం’ అని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ చౌధురి వెల్లడించారు.