ప్రధానికి రెండేళ్ల పాప.. త్వరలో పెండ్లి!
దిశ, వెబ్‌డెస్క్: న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెర్డ్ పెండ్లికి సిద్ధమయ్యారు. వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఆమె.. వ్యక్తిగత జీవితం పై కూడా ఫోకస్ చేశారు. అయితే, ఏడేళ్ల క్రితం పరిచయమైన టెలివిజన్ హోస్ట్ గేఫ్లోర్డ్‌తో సహజీవనం చేస్తున్న జెసిండా గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ జంటకు రెండేళ్ల క్రితం కూతురు కూడా పుట్టింది. అప్పటినుంచి పాప బాధ్యతలు మొత్తం గేఫ్లోర్డ్ చూసుకునేవారు. ఇదే సమయంలో ఎన్నికలు, కరోనా వైరస్ పై తగు ప్రణాళికలు రచించిన జెసిండా […]
దిశ, వెబ్‌డెస్క్: న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెర్డ్ పెండ్లికి సిద్ధమయ్యారు. వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఆమె.. వ్యక్తిగత జీవితం పై కూడా ఫోకస్ చేశారు. అయితే, ఏడేళ్ల క్రితం పరిచయమైన టెలివిజన్ హోస్ట్ గేఫ్లోర్డ్‌తో సహజీవనం చేస్తున్న జెసిండా గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ జంటకు రెండేళ్ల క్రితం కూతురు కూడా పుట్టింది. అప్పటినుంచి పాప బాధ్యతలు మొత్తం గేఫ్లోర్డ్ చూసుకునేవారు. ఇదే సమయంలో ఎన్నికలు, కరోనా వైరస్ పై తగు ప్రణాళికలు రచించిన జెసిండా రెండింటిని జయించిన విషయం తెలిసిందే. ఇక తమ దేశ ప్రధాని పెండ్లి కోసం న్యూజీలాండ్ జనాలు తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.