Rahul Gandhi: అనుచితంగా ప్రవర్తించారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు

పార్లమెంటు వెలుపల జరిగిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ తన దగ్గరగా వచ్చి అసౌకర్యానికి గురి చేశారని ఆమె ఆరోపించారు

Update: 2024-12-19 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నాగాలాండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ఫంగ్నాన్ కొన్యాక్ గురువారం రాజ్యసభ ఛరిమన్ ధన్‌ఖర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు వెలుపల జరిగిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ తన దగ్గరగా వచ్చి అసౌకర్యానికి గురి చేశారని ఆమె ఆరోపించారు. గట్టిగా అరుస్తూ తన చేరువగా అనుచితంగా ప్రవర్తించారని, ఆ పరిస్థితిలో తాను అసౌకర్యానికి గురయ్యానని ఆమె వివరించారు. తమ పార్టీకి చెందిన ఇతర సభ్యులతో కలిసి తాను ప్లకార్డు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాను. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనకు సమీపంగా వచ్చి, తనపై అరిచారు. అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఇబ్బంది పడ్డాను. దాంతో తాను పక్కకు వెళ్లిపోయాయని, ఒక మహిళగా, ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఈ సంఘటన తన గౌరవాన్ని ప్రభావితం చేసిందని ఆమె ధన్‌కర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా రాహుల్ గాంధీ ఈ విధంగా చేయకూడదని పేర్కొన్నారు.  

Tags:    

Similar News