సన్‌రైజర్స్‌ అభిమానులకు గుడ్‌న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు..!

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021లో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటికే న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో దశకు హాజరవుతారని ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ కేల్ జేమిసన్ వారి ఫ్రాంచైజీల తరఫున అందుబాటులోకి రానున్నారు. కాగా అదే సమయంలో పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ […]

Update: 2021-06-25 11:03 GMT

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021లో మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు. ఇప్పటికే న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు యూఏఈలో జరగనున్న ఐపీఎల్ రెండో దశకు హాజరవుతారని ఆయా ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ కేల్ జేమిసన్ వారి ఫ్రాంచైజీల తరఫున అందుబాటులోకి రానున్నారు. కాగా అదే సమయంలో పాకిస్తాన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ జరుగనున్నదని.. అయితే జాతీయ జట్టుకు ఆడాలా? ఐపీఎల్‌లో పాల్గొనాలా అనేది ఆటగాళ్ల ఇష్టానికే వదిలేస్తున్నట్లు న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తెలియజేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు దూరమవుతున్నారని ఆందోళనలో ఉన్న ఫ్రాంచైజీలకు న్యూజీలాండ్ ఆటగాళ్ల రాక కాస్త ఊరట కలిగిస్తున్నది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇది మరింత సంతోషం కలిగించే విషయం. జట్టులో కీలక ఆటగాళ్లైన డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో రావడం కష్టమైన సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అందుబాటులో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News