వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు..సుపారీ హత్య ?
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారింది. 47 రోజులుగా కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శుక్రవారం వాచ్‌మన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సెక్షన్ 164 కింద వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకాది సుపారీ హత్యగా తేల్చినట్టు ప్రచారం జరుగుతుంది. వివేకా హత్య […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలం కీలకంగా మారింది. 47 రోజులుగా కేసు విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శుక్రవారం వాచ్‌మన్ రంగయ్యను జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సెక్షన్ 164 కింద వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకాది సుపారీ హత్యగా తేల్చినట్టు ప్రచారం జరుగుతుంది. వివేకా హత్య వెనుక 9 మంది ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ఈ కేసును సీబీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 47 రోజులుగా కడప కేంద్రగారంలోని గెస్ట్‌హౌస్ వేదికగా విచారణ చేస్తోంది. వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్‌మెన్ రంగయ్య, ఇనాయతుల్లాతో పాటు ఉమామహేశ్వరరెడ్డిలను సీబీఐ అధికారులు పదే పదే విచారిస్తున్న సంగతి తెలిసిందే.