వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి ఈ హత్యకేసుపట్ల విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్‌ను సీబీఐ అధికారులు విచారించారు. మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని విచారణకు పిలిపించారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్‌తో పాటు మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్, పలువురు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజుల నుంచి ఈ హత్యకేసుపట్ల విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ట్రాన్స్ పోర్టు డిప్యూటీ కమిషనర్‌ను సీబీఐ అధికారులు విచారించారు. మొదటిసారిగా ఒక జిల్లా స్థాయి అధికారిని విచారణకు పిలిపించారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్‌తో పాటు మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్, పలువురు సిబ్బందిని కూడా విచారణకు పిలిపించారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని వాహనాల వివరాలను ట్రాన్స్ పోర్టు అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. నాలుగు రోజులుగా వివేకానందరెడ్డి డ్రైవర్ దస్తగిరిని విచారిస్తూ ఆయనతో పాటు ట్రాన్స్ పోర్టు అధికారులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ను పులివెందులకు తీసుకెళ్లారు. అక్కడ కూడా పలు విషయాలపై విచారణ జరిపారు.