మెస్సెంజర్ యాప్‌లను టార్గెట్ చేస్తున్న వోల్ఫ్‌రాట్ ట్రోజన్!

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి మెసెంజర్ యాప్‌లను వోల్ఫ్‌రాట్ ట్రోజన్ దాడి చేస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్‌డేట్ పేరుతో వచ్చే లింకులతో ఈ ట్రోజన్ ప్రవేశిస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన తర్వాత వినియోగదారుని ఫొటోలు, వీడియోలు, మెసేజులు, ఆడియో రికార్డింగులను ట్రోజన్ కమాండ్ కంట్రోల్‌కి పంపిస్తుంది. ఈ ట్రోజన్‌కి వోల్ఫ్‌రాట్ అని సిస్కో టాలోస్ పరిశోధకులు పేరు పెట్టారు. గతంలో వచ్చిన డెన్‌డ్రాయిడ్ మాల్‌వేర్ సవరించిన వెర్షన్ అని సిస్కో సైబర్ నిపుణులు అన్నారు. ఈ […]

Update: 2020-05-22 05:29 GMT

ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి మెసెంజర్ యాప్‌లను వోల్ఫ్‌రాట్ ట్రోజన్ దాడి చేస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్‌డేట్ పేరుతో వచ్చే లింకులతో ఈ ట్రోజన్ ప్రవేశిస్తుంది. ఒక్కసారి ప్రవేశించిన తర్వాత వినియోగదారుని ఫొటోలు, వీడియోలు, మెసేజులు, ఆడియో రికార్డింగులను ట్రోజన్ కమాండ్ కంట్రోల్‌కి పంపిస్తుంది. ఈ ట్రోజన్‌కి వోల్ఫ్‌రాట్ అని సిస్కో టాలోస్ పరిశోధకులు పేరు పెట్టారు.

గతంలో వచ్చిన డెన్‌డ్రాయిడ్ మాల్‌వేర్ సవరించిన వెర్షన్ అని సిస్కో సైబర్ నిపుణులు అన్నారు. ఈ రిమోట్ యాక్సెస్ ట్రోజన్ నిర్దిష్టంగా మెసేజింగ్ యాప్‌లనే టార్గెట్ చేస్తోందని వారు అన్నారు. వాట్సాప్ రన్
అవుతుండగా ఈ ట్రోజన్ స్క్రీన్ మొత్తాన్ని వీడియో రికార్డు చేస్తుందని వారు చెప్పారు. ప్రస్తుతానికి ఈ వోల్ఫ్‌రాట్ థాయ్‌లాండ్ యూజర్లను టార్గెట్ చేసిందని, సర్వర్లో డొమైన్ పేర్లు కూడా థాయ్ వంటకాలే పేర్లు ఉండటంతో ఈ విషయం తెలిసింది. సర్వైలెన్స్ కోసం స్పై ఆధారిత మాల్‌వేర్ ఉపయోగించే వోల్ఫ్ రీసెర్చి దీన్ని ఆపరేట్ చేస్తోంది. అయితే దీని గురించి అధికారిక ఆధారాలు లేవు. ఈ ట్రోజన్‌ని ఇంటెలిజెన్స్ సేకరించడానికి కూడా ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News