భారతీయ ‘వివాహ వ్యవస్థ’కు చెంపపెట్టు!

‘మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా?’ అని అడిగితే దాదాపు భారతీయులందరూ గర్వంగా చెప్పుకోదగ్గ సమాధానం ‘మ్యారేజ్ తర్వాత లవ్’. అవును.. ఇక్కడ పెళ్లి అనగానే అరేంజ్డ్ మ్యారేజ్ అనే గుర్తొస్తుంది. పెళ్లిచూపులు అనే కాన్సెప్టుతో ఇది ప్రారంభమవుతుంది. కానీ పెళ్లి చూపుల కంటే ముందే ఆ చూపులు చూడాల్సిన వ్యక్తిని ఎంచుకోవాలి. అందుకు ఒక పెళ్లిళ్ల పేరయ్య అవసరం. కానీ ఇప్పుడు మ్యాట్రిమోని వెబ్‌సైట్లు వచ్చేశాయి. ఒకర్ని ఎంచుకునే ముందు వారిలో ఏమేం లక్షణాలు ఉండాలో […]

Update: 2020-07-24 01:17 GMT

‘మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా?’ అని అడిగితే దాదాపు భారతీయులందరూ గర్వంగా చెప్పుకోదగ్గ సమాధానం ‘మ్యారేజ్ తర్వాత లవ్’. అవును.. ఇక్కడ పెళ్లి అనగానే అరేంజ్డ్ మ్యారేజ్ అనే గుర్తొస్తుంది. పెళ్లిచూపులు అనే కాన్సెప్టుతో ఇది ప్రారంభమవుతుంది. కానీ పెళ్లి చూపుల కంటే ముందే ఆ చూపులు చూడాల్సిన వ్యక్తిని ఎంచుకోవాలి. అందుకు ఒక పెళ్లిళ్ల పేరయ్య అవసరం. కానీ ఇప్పుడు మ్యాట్రిమోని వెబ్‌సైట్లు వచ్చేశాయి. ఒకర్ని ఎంచుకునే ముందు వారిలో ఏమేం లక్షణాలు ఉండాలో దాన్ని బట్టి ఆయా వ్యక్తిత్వాలు ఉన్న వారిని ఎంచుకోవచ్చు. దీన్ని మొత్తం ఒక ‘మ్యాచ్ మేకింగ్’ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. పాశ్చాత్య భావాలు గల వారందరూ ఈ మ్యాచ్ మేకింగ్ ప్రక్రియను మొదటి నుంచి విమర్శిస్తూ వస్తున్నారు. రంగు, డబ్బు ఆధారంగా భాగస్వామిని ఎంచుకోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. గతవారం ఇదే ఇతివృత్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త సిరీస్ విడుదలైంది. ‘ఇండియన్ మ్యాచ్‌మేకింగ్’ పేరుతో వచ్చిన ఈ సిరీస్‌తో భారతీయ పెళ్లి సంబంధాల ప్రక్రియను తమదైన శైలిలో సెటైరికల్‌గా విమర్శించి ఇప్పుడిప్పుడే వివాదాలకు కారణమవుతోంది.

భారతీయ వీక్షకులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రాంతీయ కంటెంట్ మీద నెట్‌ఫ్లిక్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే భారతీయ ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలను నిర్మిస్తోంది. ఈ ఇండియన్ మ్యాచ్‌మేకింగ్ రియాలిటీ షో ద్వారా భారతీయ పెళ్లిళ్ల విధానానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్‌ను కేవలం భారతదేశంలోనే కాదు అమెరికా, బ్రిటన్‌లలో నివసిస్తున్న దక్షిణాసియా కమ్యూనిటీ ప్రజలు ఎగబడి చూస్తున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్‌లు ఎలా జరుగుతాయి? వాటికి ముందు జరిగే ప్రక్రియను ఇందులో చూపించారు. ముంబైకి చెందిన సీమా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తుంది. ఈమె పెళ్లిళ్లు సెట్ చేసే ఒక మహిళ. ఇప్పుడు నెటిజన్లందరూ ఈమెను సీమా ఆంటీ అని పిలుస్తున్నారు. ఒక వ్యక్తి రంగు, రూపాన్ని బట్టి సులభంగా వారి వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడంలో సీమా నిపుణురాలు. ఎలాగోలా తన దగ్గరకు వచ్చిన క్లయింట్‌లకు పెళ్లి సెట్ చేసే ఉద్దేశంతో అబద్ధాలు కూడా చెప్పి, లేని లక్షణాలను సృష్టించగల సమర్థురాలు సీమా.

ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో క్లయింట్‌కు పెళ్లి సంబంధం సెట్ చేసేందుకు సీమా ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో రొమాన్స్, ప్రేమ, మోసాలు ఇంకా చాలా అంశాల చుట్టూ ఆయా క్లయింట్ జీవితం తిరుగుతుంటుంది. అయితే వారి పెళ్లి సంబంధాన్ని నిర్ణయించడంలో సీమా పరిగణలోకి తీసుకునే అంశాలు, ఆమె తెలివితేటలు ఆసక్తిని కలిగిస్తాయి. అయితే రంగు, డబ్బు, వయస్సుల మధ్య తేడా వంటి విషయాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేస్తున్నాయి. భారతీయ వివాహ వ్యవస్థ మరీ ఇంత దారుణంగా లేదని, ఇప్పుడిప్పుడే చాలా మార్పులు వస్తున్నాయని, పెళ్లి సంబంధాలు నిర్ణయించడానికి కంటే ముందు, ప్రేమకు ప్రాధాన్యత ఇస్తున్నారని సంప్రదాయవాదులు విమర్శిస్తున్నారు. ఏదేమైనా కొన్ని తరాలుగా సంస్కృతి సంప్రదాయంలో భాగమై వస్తున్న వివాహ సంబంధాల ప్రక్రియను ఇలా విమర్శించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Tags:    

Similar News