నడిరోడ్డుపై గుజరాత్ మహిళల హల్‌చల్..
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురంలో గుజరాత్ మహిళలు హల్ చల్ చేశారు. గత కొద్ది రోజులుగా రోడ్లపై వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా వీరి ఆగడాలు శృతిమించాయి. వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్ చేయడం మెుదలు పెట్టారు. ఇవ్వకపోతే వారి భాషలో తిడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు. పార్వతీపురం టౌన్‌లోని ఓ లాడ్జిలో మకాం వేసినట్లు తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు ఆ లాడ్జి దగ్గరకు వెళ్లారు. […]
దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లా పార్వతీపురంలో గుజరాత్ మహిళలు హల్ చల్ చేశారు. గత కొద్ది రోజులుగా రోడ్లపై వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా వీరి ఆగడాలు శృతిమించాయి. వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్ చేయడం మెుదలు పెట్టారు. ఇవ్వకపోతే వారి భాషలో తిడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వారిపై నిఘా పెట్టారు.
పార్వతీపురం టౌన్‌లోని ఓ లాడ్జిలో మకాం వేసినట్లు తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు ఆ లాడ్జి దగ్గరకు వెళ్లారు. లాడ్జిలో పరిశీలించగా 24 మంది గుజరాత్ మహిళలను పోలీసులు గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చారు.. ఏం చేస్తున్నారని ఆరా తీశారు. కాగా, వారంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.