టెకీ శ్వేత మృతి కేసులో కొత్తకోణం

దిశ, వెబ్‎డెస్క్ : ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని శ్వేత తల్లిదండ్రులు శ్వేతను హత్య చేసి రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని అజయ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని వాపోయారు. ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. […]

Update: 2020-10-13 05:30 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
ప్రియుడు మోసం చేశాడని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని శ్వేత తల్లిదండ్రులు శ్వేతను హత్య చేసి రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిని అజయ్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని వాపోయారు.

ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. శ్వేత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడ‌ని అజయ్‎పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాచకొండ సైబర్ క్రైమ్‎లో ఫిర్యాదు చేస్తే సీఐ, టెక్నీషియన్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. గత నెల 18వ తేదీన కనిపించకుండా పోయిన శ్వేత ఘట్‎కేసర్ రైలు పట్టాలపై శవమై తేలిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అజయ్‎ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్వేతది ఆత్మహత్య..? హత్య..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News