న్యూ లవ్ ఫార్ములా.. చాట్.. మీట్.. డేట్.. బ్రేకప్!
దిశ, ఫీచర్స్: ప్రేమ.. లవ్.. కాదల్.. ఇష్క్.. పేరు ఏదైనా.. ప్రేమకున్న గొప్పతనం మాటల్లో వర్ణించలేం అనేవారు. కానీ ఈ రోజుల్లో అంతగా చెప్పుకోదగినంత ప్రేమ లేదు కాబట్టే వర్ణించలేరు అంటున్నారు విశ్లేషకులు. ప్రేమ ఒక జోక్ అయిపోయిందని చెప్తుంటారు. అవును.. రేయ్ నేను లవ్‌లో ఉన్నారా.. అని ఒక ఫ్రెండ్ తన బెస్టీతో చెప్పుకున్నాడు అనుకోండి.. ‘ఎప్పటి నుంచి ఎప్పటి వరకో’ అని కామెంట్స్ చేస్తారు. ప్రస్తుతమున్న 90 శాతం ప్రేమకథలు అలాగే ఉన్నాయని అభిప్రాయం. […]
దిశ, ఫీచర్స్: ప్రేమ.. లవ్.. కాదల్.. ఇష్క్.. పేరు ఏదైనా.. ప్రేమకున్న గొప్పతనం మాటల్లో వర్ణించలేం అనేవారు. కానీ ఈ రోజుల్లో అంతగా చెప్పుకోదగినంత ప్రేమ లేదు కాబట్టే వర్ణించలేరు అంటున్నారు విశ్లేషకులు. ప్రేమ ఒక జోక్ అయిపోయిందని చెప్తుంటారు. అవును.. రేయ్ నేను లవ్‌లో ఉన్నారా.. అని ఒక ఫ్రెండ్ తన బెస్టీతో చెప్పుకున్నాడు అనుకోండి.. ‘ఎప్పటి నుంచి ఎప్పటి వరకో’ అని కామెంట్స్ చేస్తారు. ప్రస్తుతమున్న 90 శాతం ప్రేమకథలు అలాగే ఉన్నాయని అభిప్రాయం. ఏదో పది శాతం లవ్ స్టోరీస్ మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తున్నాయి. అందులో కూడా కొన్ని తొందరపడి చేసుకున్న మ్యారేజెస్ ఉండకపోలేదు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం..మళ్లీ మరో పెళ్లి చేసుకోవడం..ఈ కాలంలో కామన్ అయిపోయింది అనుకోండి.
న్యూ లవ్ ఫార్ములా..
అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అంటే..పెరిగిన సోషల్ మీడియా యూజింగ్, డేటింగ్ యాప్స్ ఫాలో కావడం. అవును..స్కూల్ పిల్లల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు..మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరూ ఖాళీగా ఉండట్లేదు. కొత్తగా సీక్రెట్ పార్ట్‌నర్‌ను ఎన్నుకునే ప్రయత్నాల్లోనే ఉంటున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ పిల్లాడు ఫోన్ వినియోగిస్తూ తప్పుదారి పడుతున్నాడు. ఊహ తెలియని వయసులో ఊహకందని విషయాల్లో భాగస్వామి అవుతున్నాడు. సినిమాల ప్రభావంతో ప్రేమ అంటాడు..పెళ్లి చేసుకుందాం అంటాడు..కాదంటే చంపేస్తాడు..కారాగారం పోతాడు. ఇక యూత్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చదువుకోమని కాలేజీకి పంపిస్తే.. సెల్ ఫోన్‌తో సావాసం చేస్తాడు..సోషల్ మీడియాలో ఒకరితో చాటింగ్..కాలేజీలో మరొకరితో మీటింగ్..ఇలా ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురిని మెయింటెన్ చేసేవాళ్లు ఉన్నారు. ఇదా ప్రేమంటే..కాదు కదా. ఇంకొందరు తెలివిమీరిన యూత్ చెప్పే మాట..హా నేను లవ్‌లో ఉన్నా బ్రేకప్ చెప్పేశా..ఇప్పుడు మరొకరితో లవ్‌లో ఉన్నా.. కానీ ఒకేసారి ఒకరితోనే లవ్‌లో ఉన్నా.. అది కూడా జెన్యూన్‌గా అని చెప్తుంటారు. అది ‘ట్రూ లవ్’..అంటూ లవ్‌కు ఒక కొత్త ఫార్ములా తీసుకొచ్చారు.
చాట్.. మీట్.. డేట్.. బ్రేకప్..
సోషల్ మీడియాలో చాట్ చేశామా.. ఓ కేఫ్ ఎంచుకుని మీట్ అయ్యామా..నాలుగు ఐదు నెలలు చెట్టాపట్టాలేసుకుని తిరిగామా.. ఆ తర్వాత డేట్ మొదలెట్టామా.. అలా ఓ ఐదారు సంవత్సరాలు ఎంజాయ్ చేశామా.. హే.. ఈ లైఫ్ చాలా రొటీన్‌గా ఉంది.. బోరు వస్తోంది.. సో.. లెట్స్ బ్రేకప్ అని చెప్పేసుకుంటారు. నో ఎమోషన్స్.. నో ఎథిక్స్.. నో వాల్యూస్. అంటే లవ్ అనేది లస్ట్‌గా మారి.. దాని మీద ఇంట్రెస్ట్ తగ్గాక.. బ్రేకప్‌కు వచ్చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ జనరేషన్‌లో మ్యాగ్జిమమ్ లవ్ స్టోరీస్ ఇవే. ఒక వేళ ఇద్దరిలో ఒకరు నిజంగానే ప్రేమించారు అనుకోండి.. మా అమ్మానాన్నకు ఇష్టం లేదు.. మనం తప్పకుండా విడిపోవాల్సిందే అని కథలు చెప్పి తప్పించుకుంటారు. ఇలా ట్రూగా ఎవరైతే లవ్ చేశారో..వాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లడం, సూసైడ్ అటెంప్ట్ చేయడం చేస్తుంటారు. ఒక వేళ ధైర్యవంతులైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కే ప్రయత్నం చేస్తుంటారు. మ్యాటర్ ఈజ్.. లవ్ బర్డ్స్ అంటుంటాం. కానీ, వారిద్దరి మధ్య లవ్ ఉండదు.. ఆటోమెటికల్లీ పెళ్లి కూడా ఉండదు.
అమ్మానాన్నకు దూరంగా.. అన్ నోన్ పర్సన్స్‌కు దగ్గరగా..
హైయర్ ఎడ్యుకేషన్.. హై ప్యాకేజ్ శాలరీస్.. సిటీ కల్చర్..అమ్మానాన్నకు దూరంగా..అన్ నోన్ పర్సన్స్‌కు దగ్గరగా ప్రస్తుతమున్న ప్రేమల్లో పరిస్థితి ఇది. పిల్లలు గొప్పచదువులు చదివి గొప్పగా స్థిరపడాలని అమ్మానాన్న ఆలోచించి సిటీకి పంపిస్తే.. ఇక్కడికి వచ్చి చేసే పని ఏంటి..? బోల్డ్ సినిమాలు, సిరీస్‌లు చూడటం.. వాటిలో తమను ఊహించుకుని.. తాము కూడా అలా ఎందుకు చేయకూడదు.. కొన్ని రోజులు ఒకరితో ఎంజాయ్ చేస్తే తప్పేంటి? అనే ఆలోచనకు వచ్చేస్తున్నారు. తర్వాత పెళ్లి చేసుకుని ఎలాగూ సీరియస్ లైఫ్‌లోకి వెళ్లాల్సిందే కదా అనుకుని.. ఇక్కడ సీరియస్‌నెస్ మిస్ చేస్తున్నారు. లవ్‌ను సీరియస్‌గా తీసుకోకుండా ఒక పార్ట్ టైం ఎంజాయ్‌మెంట్‌లా ఫీల్ అవుతున్నారు. అందుకే లవ్ అనేది ఓ జోక్ అయిపోయింది. పార్ట్‌నర్ దగ్గర సీరియస్‌గా ఉన్నట్లు యాక్ట్ చేయడం.. ఫ్రెండ్ దగ్గర ఆ పార్ట్‌నర్ మీదే జోకులు వేయడం కామన్ అయిపోయింది. ఇంకొందరైతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉండటాన్ని ప్రెస్టీజియస్‌గా ఫీలవుతుంటారు. ఫ్రెండ్ ప్రేమలో ఉన్నాడా.. నేను కూడా లవ్‌లో పడాల్సిందే అంటూ పార్ట్‌నర్‌ను వెతుక్కుంటున్నారు తప్పితే నిజంగా ఒకరిని లవ్ చేయాలని, వారితో లైఫ్ లాంగ్ జీవించాలని మాత్రం కాదు.
ఓల్డ్ ఏజ్.. ప్యూర్ లవ్…
టీనేజ్ లవ్ స్టోరీస్ గురించే మాట్లాడుతుంటాం కానీ.. ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీస్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. ప్రస్తుతం ట్రెండ్ అయిన ఈ సబ్జెక్ట్ లవ్ స్టోరీస్‌లో స్వచ్ఛమైన ప్రేమ ఉంది అంటుంటారు నిపుణులు. ఒకప్పుడు గొప్పగా ప్రేమించిన ప్రేమికురాలు లేదా ప్రేమికుడు దూరమవుతాడు. లైఫ్ అంతా చూసి ఓల్డ్ ఏజ్‌లో కాస్త రిలాక్స్ అవుదామనుకునే చాలా మందికి..తను పెళ్లాడిన వారితో కాకుండా ప్రేమించిన వారితో పెళ్లి అయితే ఇంకేంత బాగుండేదో అని ఊహించుకుంటారు. ఆ ఊహనే నిజం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఆ ఒక్క కోరికను మాత్రం ఎందుకు కోరికలాగే ఉంచాలి అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఓల్డ్ ఏజ్‌లో న్యూ కపుల్స్ పుట్టుకొస్తున్నారు. తము యూత్‌లో ఉన్నప్పుడు చూపించలేని ప్రేమను ఇప్పుడు చూపిస్తున్నారు. ప్రేమలో కొత్తదనాన్ని పంచుతూ… జన్మను చాలించే సమయంలో జన్మకు సరిపోయే ప్రేమను పంచుతున్నారు.
లవ్ జెన్యూన్‌గా లేదు: నవ్య భారతి, ఐఏఎస్ ఆస్పిరెంట్
ప్రజెంట్ జనరేషన్‌లో లవ్ అనేది జెన్యూన్‌గా లేదు. కేవలం అవసరాల కోసం మాత్రమే ప్రేమించుకుంటున్నారు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉన్నంత కాలం హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటారు. లవ్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో దాదాపు ప్యూర్ లవ్ అనేది లేదు.
లవ్ అనేది దండగ : శ్యామ్, స్టూడెంట్
లవ్ అనేది దండగ. లేని పోని మెంటల్ టెన్షన్. పార్ట్‌నర్ కోసం కాంప్రమైజ్ కావాలి..ఒక వేళ ప్రేమలో ఎప్పుడూ ఒకరే అలా కాంప్రమైజ్ అవడం స్టార్ట్ చేస్తే లీనియస్ ఇచ్చినవాళ్లం అవుతాం. చీప్ అయిపోతాం. వారిని పట్టించుకోరు. ముఖ్యంగా లవ్‌లో ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉండాలి. అలా అయితేనే ఆ లవ్ నిలబడుతుంది.