సంచలనాలకు కేంద్రంగా గ్యాంగ్ స్టర్ దూబె నివాసం
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె ఎన్ కౌంటర్ పై విమర్శలు వస్తున్నాయి. 8 మందిని పోలీసులను హతమర్చిన వికాస్ దూబెను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకున్నా.. పోలీసులు అతడిని పట్టుకున్న 24 గంటలలోపై ఎన్ కౌంటర్ చేయడంపై పెదవి విరుస్తున్నారు. దూబె వెనకాల ఎవరెవరు ఉన్నారు?, అతడికి సహకరించిన పోలీసులు, రాజకీయ నేతల పేర్లు, అతడి దందాలను విచారణ చేయకుండనే చంపేశారని, అసలైన నిందితులను వదిలేయడానికి ఎన్ కౌంటర్ చేశారని […]
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబె ఎన్ కౌంటర్ పై విమర్శలు వస్తున్నాయి. 8 మందిని పోలీసులను హతమర్చిన వికాస్ దూబెను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకున్నా.. పోలీసులు అతడిని పట్టుకున్న 24 గంటలలోపై ఎన్ కౌంటర్ చేయడంపై పెదవి విరుస్తున్నారు. దూబె వెనకాల ఎవరెవరు ఉన్నారు?, అతడికి సహకరించిన పోలీసులు, రాజకీయ నేతల పేర్లు, అతడి దందాలను విచారణ చేయకుండనే చంపేశారని, అసలైన నిందితులను వదిలేయడానికి ఎన్ కౌంటర్ చేశారని విమర్శిస్తున్నారు.
కాగా వికాస్ దూబె ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు కాన్పూర్ సమీపంలోని ఆయన స్వగ్రామంలో శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వికాస్ నివాసంలో భారీగా నాటుబాంబులు, మరణాయుదాలు బయటపడ్డట్టు సమాచారం. అతడి ఇల్లు ఓ బాంబుల డెన్ గా కనిపించిందని తనిఖీల్లో పాల్గొన్న పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా నరరూప రాక్షసుడిగాపేరొందిన దూబె హతమవ్వడం పట్ల ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.