సరికొత్త న్యూక్లియోమ్
దిశ, శేరిలింగంపల్లి: భారతదేశ జన్యుశాస్త్ర సామర్ధ్యంలో కొత్త శకానికి నాంది పలికి, న్యూక్లియోమ్ ఇన్ఫర్మేటిక్స్ ప్రస్తుతం దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత అధునాతన జెనోమిక్స్ ఎన్ కేసీ సెంటర్ ఫర్ జెనోమిక్స్ రీసెర్చ్‌ను ఆవిష్కరించింది. మధ్యప్రదేశ్ ఖాండ్వా పార్లమెంట్ నియోజకవర్గం నుండి 6 సార్లు పార్లమెంట్ సభ్యుడైన నంద్ కుమార్ సింగ్ చౌహాన్ జ్ఞాపకార్థం స్థాపించబడిన ఈ ప్రయోగశాల, వ్యవసాయం, పశుసంవర్ధక వైద్యంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. గురువారం హైదరాబాద్ లోని ఓ హోటల్ […]
దిశ, శేరిలింగంపల్లి: భారతదేశ జన్యుశాస్త్ర సామర్ధ్యంలో కొత్త శకానికి నాంది పలికి, న్యూక్లియోమ్ ఇన్ఫర్మేటిక్స్ ప్రస్తుతం దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత అధునాతన జెనోమిక్స్ ఎన్ కేసీ సెంటర్ ఫర్ జెనోమిక్స్ రీసెర్చ్‌ను ఆవిష్కరించింది. మధ్యప్రదేశ్ ఖాండ్వా పార్లమెంట్ నియోజకవర్గం నుండి 6 సార్లు పార్లమెంట్ సభ్యుడైన నంద్ కుమార్ సింగ్ చౌహాన్ జ్ఞాపకార్థం స్థాపించబడిన ఈ ప్రయోగశాల, వ్యవసాయం, పశుసంవర్ధక వైద్యంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. గురువారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వర్చువల్ విధానంలో హాజరైన ఈ కార్యక్రమంలో దుష్యంత్ సింగ్ భాగేల్ అత్యాధునిక ప్రయోగశాలను ప్రారంభించారు. న్యూక్లియోమ్ ఇన్ఫర్మేటిక్స్ సీఈఓ బాఘెల్, కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ కే. విజయ్ రాఘవన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నంద్రామ్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జన్యుశాస్త్రంలో ఎన్నో కొత్త ప్రయోగాలకు ఆస్కారం ఉందని, వేలాది జంతువుల డీఎన్ ఏ, జన్యు పరిణామక్రమం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, నూతన ప్రయోగాల ద్వారా న్యూక్లియోమ్ ఆ దిశగా ప్రయోగాలు చేయాలని, అలాగే మానవాళికి ఉపయోగకరమైన పరిశోధనలు చేస్తూ వ్యాధులపై విజయం సాధించేలా ముందుకు సాగాలన్నారు. అనంతరం మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. నంద్రామ్ సింగ్ చౌహాన్ ప్రజా ప్రతినిధిగా విశేష సేవలు అందించారని అలాగే న్యూక్లియోమ్ ద్వారా అనేక ప్రయోగాలు నిర్వహించి జన్యుశాస్త్ర ప్రగతికి తోడ్పాటునందించారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హర్షవర్ధన్ చౌహాన్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కే. విజయ్ రాఘవన్, రాజేంద్ర గెహ్లాట్, అజయ్ ప్రతాప్ సింగ్, అతుల్ చతుర్వేది, డాక్టర్ రేణు స్వరూప్ న్యూక్లియోమ్ ప్రతినిధులు, పలువురు శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.