జీడీపీ పెరిగిందన్న కేటీఆర్.. జీతాలెందుకివ్వరంటున్న నెటిజన్లు

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ట్విట్టర్లో ఏ పోస్టు చేసినా.. దానికి తగ్గట్టుగా నెటిజన్లు విమర్శిస్తూ రీట్వీట్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేటీఆర్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ప్రొవిజనల్ ఎస్టిమేట్స్‌లో ఉన్న వృద్ధిపై ఓ గ్రాఫ్ ఫొటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమదైన శైలిలో సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నారు. ట్వీట్ ప్రకారం..‘‘ తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రం అభివృద్ధి […]

Update: 2021-09-04 02:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ట్విట్టర్లో ఏ పోస్టు చేసినా.. దానికి తగ్గట్టుగా నెటిజన్లు విమర్శిస్తూ రీట్వీట్లు, కామెంట్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేటీఆర్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ప్రొవిజనల్ ఎస్టిమేట్స్‌లో ఉన్న వృద్ధిపై ఓ గ్రాఫ్ ఫొటోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమదైన శైలిలో సెటైర్లు, కౌంటర్లు వేస్తున్నారు.

ట్వీట్ ప్రకారం..‘‘ తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతుండటం.. సీఎం కేసీఆర్ నాయకత్వానికి నిదర్శనం. ఈ గణాంకాలు కొన్ని రంగాల నుంచి మాత్రమే.. ఇండస్ట్రీ అండ్ ఐటీ రంగాల్లో కూడా మరిన్ని విజయగాధలు ఉన్నాయి’’ అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన నెటిజన్లు…‘‘2014 వరకు హైదరాబాద్ మరింత ఫాస్ట్‌గా అభివృద్ధి చెందింది.. కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ వీధి గూండాయిజం మాత్రమే పెరుగుతోంది. వీరి ఆగడాలను భరించలేక.. చాలా కంపెనీలు తమ బ్రాంచ్‌లను బెంగళూరు, పూణె, ఢిల్లీ నగరాలకు షిఫ్ట్ చేశారు. రాష్ట్రంలో తరచూ ఏదో ఒక బంద్ అని పిలుపునిస్తుండటంతో చాలా కంపెనీలు తెలంగాణ మీద విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి. ’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

మరో నెటిజన్ ‘‘చేసిన పనికే జీతం లేదు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 6-7 ఏళ్లుగా పనిచేస్తున్న 1658 మంది గెస్ట్ లెక్చరర్లు గత ఏడాదిలో మూడు నెలలు విధులు నిర్వహించినా.. నేటికి జీతాలు అందలేదు. ఇంకా ఇప్పుడు విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల మా జీవితాలు వీధుల్లో పడ్డాయి. దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్’’ అంటూ తమ గోడును చెప్పుకొచ్చారు. అయితే జీడీపీలో ఇంతమేర వృద్ధి ఉన్నప్పుడు తమ జీతాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారనే విధంగా సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేస్తుండటం గమనార్హం.

Tags:    

Similar News