ఆస్ట్రాజెనకా టీకాపై నిషేధం విధించిన నెదర్లాండ్స్..
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టీకాల సామర్థ్యంపై అనుమానాల కారణంగా పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రాజెనకా టీకాపై నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు వారాల పాటు ఈ టీకాను వినియోగించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు గుర్తించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికి […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టీకాల సామర్థ్యంపై అనుమానాల కారణంగా పలు దేశాలు నిషేధం విధిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రాజెనకా టీకాపై నెదర్లాండ్స్ ప్రభుత్వం నిషేధం విధించింది. రెండు వారాల పాటు ఈ టీకాను వినియోగించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు గుర్తించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పటికి 7 దేశాలు ఆస్ట్రాజెనకా టీకాపై నిషేధం విధించాయి. తాజాగా నెదర్లాండ్స్ కూడా ఆ జాబితాలో చేరింది.