నెట్‌ఫ్లిక్స్ న్యూ ప్లాన్ ‘మొబైల్ ప్లస్’

దిశ, వెబ్‌డెస్క్ : స్ట్రీమింగ్ సర్వీసెస్, యాప్స్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. దేశ జనాభా ఎక్కువ కావడంతో పాటు ఇక్కడ ఇంటర్నెట్ చార్జీలు కూడా తక్కువన్న విషయం తెలిసిందే. అందువల్ల ఇక్కడ ఏ ప్లాట్‌ఫామ్ క్లిక్ అయినా.. వాటికి ఢోకా ఉండదు. ఈ క్రమంలోనే అమెరికన్ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ భారతీయులను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇండియన్ కంటెంట్‌ను అందివ్వడంతో పాటు ఇక్కడి యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇదివరకే రూ.199 […]

Update: 2020-07-23 00:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్ట్రీమింగ్ సర్వీసెస్, యాప్స్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్. దేశ జనాభా ఎక్కువ కావడంతో పాటు ఇక్కడ ఇంటర్నెట్ చార్జీలు కూడా తక్కువన్న విషయం తెలిసిందే. అందువల్ల ఇక్కడ ఏ ప్లాట్‌ఫామ్ క్లిక్ అయినా.. వాటికి ఢోకా ఉండదు. ఈ క్రమంలోనే అమెరికన్ స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ భారతీయులను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇండియన్ కంటెంట్‌ను అందివ్వడంతో పాటు ఇక్కడి యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్లను తీసుకొస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇదివరకే రూ.199 ప్లాన్‌ను భారత్‌లో మాత్రమే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ తీసుకున్నవారికి ‘స్టాండర్డ్ డెఫినేషన్(480పీ) స్ట్రీమింగ్ క్వాలిటీ’ అందిస్తోంది. కాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ యూజర్ల కోసం ఇప్పుడు మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన న్యూ ప్లాన్ ‘మొబైల్ ప్లస్’. అంటే.. రూ.199 ప్లాన్‌లో కేవలం మొబైల్ వినియోగదారులు మాత్రమే చూసే వీలుండేది. ఇప్పుడు రూ. 349 ప్లాన్ తీసుకున్నట్టయితే.. మొబైల్‌ డివైజ్‌తో పాటు ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్లలోనూ నెట్‌ప్లిక్స్‌ను వీక్షించొచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్‌లో హై డెఫినిషన్‌(హెచ్‌డీ) కంటెంట్‌ను చూసే వీలుంటుంది. అయితే టెలివిజన్‌ స్క్రీన్‌లకు మాత్రం ఈ ఆఫర్‌ వర్తించకపోవడం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్‌స్క్రిప్షిన్ కాస్ట్ రూ. 499/-, ఈ ప్లాన్‌లో కేవలం ఒకే యూజర్ మాత్రమే వాడుకునే చాన్స్ ఉంది. అదే ప్రీమియం ప్లాన్ (రూ. 799/-) తీసుకుంటే.. నలుగురు యూజర్లు వాడుకోవచ్చు. ఇందులో 4కె వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ వస్తుంది.

Tags:    

Similar News