ChatGPT: మొరాయించిన చాట్ జీపీటీ.. నెలలో ఇది రెండోసారి.. అసహనానికి గురైన యూజర్లు

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ సేవలకు ప్రపంచవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడింది.

Update: 2024-12-27 07:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌బాట్‌ చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు ప్రపంచవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడింది. ఓపెన్ ఏఐ ఉత్పత్తుల్లో అత్యంత జనాదరణ పొందినది చాట్ జీపీటీ యాప్ కొన్ని గంటలు మొరాయించింది. ఈ ప్రభావం (OpenAI) ఓపెన్‌ఏఐకి చెందిన ఏపీఐ, సోరా ప్లాట్‌ఫామ్స్‌పై కూడా పడింది. ఒక నెలలో ఇది రెండోసారి చాట్ జీపీటీలో సమస్య రావడం గమనార్హం. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ సమస్యను చాట్ జీపీటీ యూజర్లు ఎదుర్కొన్నారు. దీంతో యూజర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు.

అప్‌స్ట్రీమ్ ప్రొవైడర్ వల్వే సమస్య ఉత్పన్నమైనట్లు ఓపెన్ ఏఐ గుర్తించింది. ఈమేరకు అంతరాయం ఓపెన్‌ఏఐ ఎక్స్ వేదికగా శుక్రవారం పోస్ట్ స్పందించింది. చాలా వరకు చాట్ జీపీటీ, ఏపీఐ, సోరా (API, Sora) కొన్ని గంటలపాటు పని చేయలేదు. దీని వలన కలిగిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండని ఆవేదన చెందింది. మేము సమస్యను గుర్తించాము.. రికవరీ ప్రారంభించినట్లు తెలిపింది. మరో ట్వీట్ చేస్తూ.. మేము ఇప్పుడు దాదాపు పూర్తిగా ఆన్‌లైన్‌కి తిరిగి వచ్చాము, మీ సహనానికి మేము అభినందిస్తున్నాము.. అంటూ సమస్య పరిష్కరించినట్లు పరోక్షంగా ట్వీట్‌లో పేర్కొంది.

 

Tags:    

Similar News