దంపతులపై గొడ్డలితో మేనల్లుడు దాడి
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో దారణ ఘటన చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా మేనత్త, మేనమామపై మేనల్లుడు మల్లేశ్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆ దంపతులిద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో ఉన్న రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయలు కావడంతో రాజయ్య మార్గంమధ్యంలోనే మృతిచెందాడు. అనంతరం నిందితుడు మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు […]
దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో దారణ ఘటన చోటుచేసుకుంది. భూ తగాదాల కారణంగా మేనత్త, మేనమామపై మేనల్లుడు మల్లేశ్ గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆ దంపతులిద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపుమడుగులో ఉన్న రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయలు కావడంతో రాజయ్య మార్గంమధ్యంలోనే మృతిచెందాడు. అనంతరం నిందితుడు మల్లేశ్ పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.