భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీహార్ కిషన్‌గంజ్ సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు ముగ్గురు భారత పౌరులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడు 25 ఏళ్ల జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కిషన్ గంజ్ కు చెందిన జితేందర్ తన పశువులు తప్పిపోవడంతో వెతికేందుకు తన ఇద్దరు స్నేహితులు అకింత్ కుమార్ సింగ్, గుల్షన్ కుమార్ […]
దిశ, వెబ్ డెస్క్: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీహార్ కిషన్‌గంజ్ సరిహద్దు వద్ద నేపాల్ పోలీసులు ముగ్గురు భారత పౌరులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుడు 25 ఏళ్ల జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కిషన్ గంజ్ కు చెందిన జితేందర్ తన పశువులు తప్పిపోవడంతో వెతికేందుకు తన ఇద్దరు స్నేహితులు అకింత్ కుమార్ సింగ్, గుల్షన్ కుమార్ సింగ్‌లతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగారు. మాఫి గ్రామంలో వెతుకుతుండగా గస్తీ కాస్తున్న నేపాల్ పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.