లైంగిక వేధింపులు.. నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై వేటు
దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వేటు వేసింది. సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి ఆయనను ప్రభుత్వం తప్పించింది. ఆయనను తిరుపతి రుయా ఆస్పత్రికి బదిలీ చేశారు. డీఎంఈ త్రిసభ్య కమిటీ, డిస్ట్రిక్ కమిటీలు దీనిపై విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి అందించాయి. దీంతో నివేదిక ఆధారంగా ప్రభుత్వం వేటు వేసింది. అటు ఈ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.