Breaking News : శబరిమల యాత్రికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

అయ్యప్ప భక్తుల(Ayyapa Devotees)కు కేరళ ప్రభుత్వం(Kerala Govt) గుడ్ న్యూస్ తెలిపింది.

Update: 2024-11-02 14:43 GMT

దిశ, వెబ్ డెస్క్ : అయ్యప్ప భక్తుల(Ayyapa Devotees)కు కేరళ ప్రభుత్వం(Kerala Govt) గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా కవరేజీ(Free Life Insurence)ని వర్తింప జేయనున్నట్టు పేర్కొంది. సీఎం పినరయి విజయన్(CM Pinarai Vijayan) అధ్యక్షతన శనివారం జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు. అలాగే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు. కేరళలోని దేవాలయాలను నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్(TCTB) ఈ స్పెషల్‌ బీమా కవరేజీ పథకానికి బీమా ప్రీమియం చెల్లించనుంది. ఈ మేరకు కేరళ మంత్రి వీఎన్ వాసవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రెండు నెలలపాటు జరగనున్న మకరవిళక్కు వేడుకలు(Makaravilakku) ఈ నెల 16న మొదలై.. డిసెంబర్‌ చివరివారం వరకు కొనసాగుతాయి. కొద్ది రోజులు ఆలయాన్ని మూసివేసి మళ్లీ జనవరి మూడో వారం వరకు భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తారు. ఈసారి రికార్డుస్థాయిలో 14వేల మంది పోలీసు సిబ్బంది, వాలంటీర్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం విజయన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News