ఆధారాలు చూపించు.. అంబటికి మంత్రి నిమ్మల సవాల్
అబద్ధాలు ఆడటంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుది అందె వేసిన చెయ్యి అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు
దిశ, వెబ్ డెస్క్: అబద్ధాలు ఆడటంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu)ది అందె వేసిన చెయ్యి అని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) విమర్శించారు. పోలవరం ఎత్తు విషయంలో అంబటి చేసిన వ్యాఖ్యలపై నిమ్మల స్పందించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు తమకెవరు చెప్పారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ఒకేమాట, ఒకే బాట అని చెప్పారు. పోలవరం, అమరావతి(Amaravati) సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు రెండు కళ్లు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.