Engineering Student: ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పుల పాలు.. సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్

ఆన్‌లైన్‌ గేమ్స్‌ (Online Games)కు బానిసై భారీగా అప్పులపాలైన ఓ స్టూడెంట్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా (Palnadu) పరిధిలోని మాచ‌ర్లలో చోటు చేసుకుంది.

Update: 2024-11-02 15:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌ గేమ్స్‌ (Online Games)కు బానిసై భారీగా అప్పులపాలైన ఓ స్టూడెంట్ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడు జిల్లా (Palnadu) పరిధిలోని మాచ‌ర్లలో చోటు చేసుకుంది. స్థానికంగా న్యూట‌న్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రోజు (శనివారం) జరిగిన ఈ ఘటన కలకలం రేపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన విద్యార్థి పేరు భరత్. అతడు బీటెక్(B-Tech) ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. ప‌ట్టణంలోని విష్ణుప్రియ లాడ్జి వెనుక భ‌వ‌నంలో నివాసం ఉంటున్నాడు. అయితే అన్‌లైన్‌ గేమ్స్ ఆడుతూ ఈ మధ్య కాలంలో భరత్ బాగా అప్పుల పాలయ్యాడు. దీంతో ఆ అప్పులు తీర్చలేక మనస్థాపం చెంది త‌న రూమ్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణం తీసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి (Govt Hospital)కి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. మరణానికి మరేమైనా కారణాలు ఉన్నాయేమో అనే కోణంలో తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. 


Similar News