అమెరికా ఎన్నికల్లో నెల్లూరు వాసి గెలుపు
దిశ, ఏపీ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో నెల్లూరు వాసి చిలంచర్ల ఏడుకొండలు విజయదుందుభి మోగించారు. కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ కు కౌన్సిల్గా అత్యధిక ఓట్లతో ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరు సొంతూరు. ఓ సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నారు. ఎస్వీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌తో ఇంజనీరింగ్ చదివారు. అనంతరం యూనివర్శిటీలో కో-ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కొన్నాళ్లపాటు ఇండియాలోనే పనిచేశారు. ఐఏఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో నెల్లూరు వాసి చిలంచర్ల ఏడుకొండలు విజయదుందుభి మోగించారు. కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ కు కౌన్సిల్గా అత్యధిక ఓట్లతో ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరు సొంతూరు. ఓ సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నారు. ఎస్వీ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్‌తో ఇంజనీరింగ్ చదివారు. అనంతరం యూనివర్శిటీలో కో-ఆపరేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. కొన్నాళ్లపాటు ఇండియాలోనే పనిచేశారు. ఐఏఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారు. ఏడుకొండలు కొన్నాళ్లు సింగపూర్‌లో పనిచేసి కాలిఫోర్నియాలోని ఫోల్సమ్ సిటీకి చేరారు. అవతార్ ఐటీ సొల్యూషన్ స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల మంది గిరిజన విద్యార్థులను చదివిస్తున్నారు. సొంతూరు విడవలూరులోనూ స్కూల్ అభివృద్ధికి సాయం చేశారు. అమెరికా ఎన్నికల్లో తమ గ్రామ నివాసి విజయం సాధించడంతో విడవలూరు ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. నెల్లూరుకు చెందిన చిలంచర్ల ఏడుకొండలు అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు