శ్రీశైలం ఆలయంలో 18 మందికి పాజిటివ్.. అమల్లోకి కొత్త రూల్స్!

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పోటాపోటీగా పెరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తెలంగాణలో 6వేలకు పైగా రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న కేసుల తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఏపీ, తెలంగాణ బోర్డర్‌లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మరోసారి కరోనా పంజా విసిరింది. ఆలయంలో విధులు నిర్వహించే 18మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్దారణ […]

Update: 2021-04-22 07:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పోటాపోటీగా పెరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తెలంగాణలో 6వేలకు పైగా రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న కేసుల తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఏపీ, తెలంగాణ బోర్డర్‌లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మరోసారి కరోనా పంజా విసిరింది.

ఆలయంలో విధులు నిర్వహించే 18మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కేసుల తీవ్రత నేపథ్యంలో ఆలయంలో కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తు్న్నట్లు ఈవో రామారావు తెలిపారు. దర్శనానికి వచ్చే వారు 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని, నెగెటివ్ రిపోర్టు ఉన్న వారికి మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News