సెలబ్రిటీలందరూ ఆమె ముఖంలోనే!
దిశ, ఫీచర్స్ : మిస్టర్ బీన్‌లా కనిపించిన ఆ అమ్మాయి, ఒక్కసారిగా ఫ్లైయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌గా మారిపోతుంది. అంతలోనే నీరజ్ చోప్రాలా యంగ్ లుక్‌లో మెరిసిపోతోంది. ఆ మరుక్షణమే ముఖమంతా కళ్లు చేసుకుని భయపెడుతోంది. చింపాంజీలా సిగ్గుపడటం, ఫేస్ కనిపించకుండా మాయ చేయడం ఆమెకు మాత్రమే చెల్లింది. తన ఇల్యూజన్ ఆర్టిస్టిక్, మేకప్ స్కిల్స్‌తో ముఖాన్ని కాన్వాస్‌గా చేసుకుని ఎంతోమంది సెలబ్రిటీల రూపాలను సృష్టిస్తోంది. ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఆర్ట్ వేయడాన్ని చాలా ఇష్టపడుతుంది. […]
దిశ, ఫీచర్స్ : మిస్టర్ బీన్‌లా కనిపించిన ఆ అమ్మాయి, ఒక్కసారిగా ఫ్లైయింగ్ సిఖ్ మిల్కా సింగ్‌గా మారిపోతుంది. అంతలోనే నీరజ్ చోప్రాలా యంగ్ లుక్‌లో మెరిసిపోతోంది. ఆ మరుక్షణమే ముఖమంతా కళ్లు చేసుకుని భయపెడుతోంది. చింపాంజీలా సిగ్గుపడటం, ఫేస్ కనిపించకుండా మాయ చేయడం ఆమెకు మాత్రమే చెల్లింది. తన ఇల్యూజన్ ఆర్టిస్టిక్, మేకప్ స్కిల్స్‌తో ముఖాన్ని కాన్వాస్‌గా చేసుకుని ఎంతోమంది సెలబ్రిటీల రూపాలను సృష్టిస్తోంది.
ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఆర్ట్ వేయడాన్ని చాలా ఇష్టపడుతుంది. కానీ కార్పొరేట్ ఉద్యోగం వల్ల తన ఆర్ట్ స్కిల్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి తగినంత సమయం దొరికేది కాదు. దాంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఇల్యూషన్ మేకప్ ఆర్టిస్ట్‌గా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. సాధారణంగా ప్రొస్థెటిక్ మేకప్‌తో మన ముఖాన్ని ఏ విధంగానైనా మార్చవచ్చు కానీ ప్రియాంక మాత్రం తన కళతోనే ఆ అద్భుతాన్ని సృష్టిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. తన ముఖాన్ని ఏపీజె అబ్దుల్ కలాం, మిల్కా సింగ్, జెన్నిఫర్ ఆనిస్టన్, మిస్టర్ బీన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వంటి ఎంతోమంది సెలబ్రిటీల ముఖచిత్రాలుగా మలిచి నెటిజన్లను ఆశ్చర్చపరిచింది. అంతేకాదు ఇల్యూషన్ మేకప్‌లో భాగంగా ఆమె తల భాగంలో క్యాండిల్ ఉన్నట్లుగా, మెడ ప్లేస్‌లో పిజ్జా, ముఖం నిండా కన్నులతో ఆమె చేసిన మేకప్ మనల్ని మాయ చేస్తుంది.
ఇలాంటి అద్భుతాన్ని సృష్టించడానికి ఆమె 8-11 గంటల పాటు కృషి చేస్తుంది. అందుకు ఎంతో సహనం కావాలి. ఆమె తన రూపాన్ని పూర్తి చేయడానికి బట్టతల టోపీలు, కాంటాక్ట్ లెన్సులు, విగ్గులను ఉపయోగిస్తుంది. ముక్కు, కన్నులు, చెంపలు ప్రతి చిన్న డీటెయిలింగ్ లోనూ ఏ విధమైనా లోపాలు లేకుండా ఎంతో కచ్చితత్వాన్ని పాటిస్తుంది. చిన్న పొరపాటు జరిగినా మళ్లీ ఆమె మొదటి నుంచి దాని కోసం కష్టపడాలి.
‘జీవితాంతం ఆ ఉద్యోగాన్ని కొనసాగించడం ఇష్టం లేదు. దాని వల్ల ఫ్రస్టేషన్ వచ్చింది. దాంతో ఉద్యోగం వదిలి రిస్క్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మేకప్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో చిన్న మేకప్ కోర్సులో చేరాను. కానీ ప్రస్తుతం అది నా జీవితాన్ని మార్చేసింది. వేయాలనుకున్న ప్రతి బొమ్మను తొలిగా కాగితం మీద వేసుకుంటాను. ఆ తర్వాత దాన్ని ముఖం మీద రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. మేకప్ పూర్తి చేయడం ఒకెత్తు అయితే, దాన్ని కెమెరా సరైన యాంగిల్ క్యాప్చర్ చేయడం సవాలుతో కూడుకున్న పని. ఆశించిన విధంగా ఫొటో రాకపోతే నా పనంతా వృథా అయిపోతోంది. ఇక నా పనితీరు తెలుసుకున్న ‘రే’ మూవీ మేకర్స్ కేకే మీనన్ పాత్ర మేకప్ కోసం నన్ను సంప్రదించారు. ఇది నాకెంతో సంతోషాన్నిచ్చిన సందర్భం’ అని ప్రియాంక తెలిపింది.