భారత్‌లో మిలీనియల్స్ రుణాలు పెరిగాయి

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆగష్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో భారతీయ మిలీనియల్స్‌లో దాదాపు సగం మంది రుణాలు పెరిగాయని ఓ సర్వే తేల్చింది. బ్రిటీష్‌కు చెందిన రుణదాత స్టాండర్డ్ చార్టర్డ్ చేసిన సర్వేలో.. ఈ మధ్య కాలంలో ఇతర విభాగాలతో పోలిస్తే గృహావసరాల వంటి రోజూవారీ ఖర్చులను నిర్వహించడం అతిపెద్ద సవాలుగా ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం అన్‌లాక్ […]

Update: 2020-12-10 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఆగష్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో భారతీయ మిలీనియల్స్‌లో దాదాపు సగం మంది రుణాలు పెరిగాయని ఓ సర్వే తేల్చింది. బ్రిటీష్‌కు చెందిన రుణదాత స్టాండర్డ్ చార్టర్డ్ చేసిన సర్వేలో.. ఈ మధ్య కాలంలో ఇతర విభాగాలతో పోలిస్తే గృహావసరాల వంటి రోజూవారీ ఖర్చులను నిర్వహించడం అతిపెద్ద సవాలుగా ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం అన్‌లాక్ చర్యలతో ఇటీవల పరిస్థితులు మెరుగుపడ్డాయి. జీడీపీ సైతం మొదట్లో ఆందోళన చెందిన దానికంటే తక్కువ ప్రతికూలంగా ఉందని సర్వే అభిప్రాయపడింది.

సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ తొలి వారం మధ్య భారత్ సహా 12 దేశాల్లో జరిపిన ఈ సర్వేలో.. సమీక్షించిన కాలంలో 44 శాతం మంది భారతీయ మిలీనియల్స్ రుణాలు గణనీయంగా పెరిగాయని, 45 ఏళ్లు పైబడిన వారిలో 28 శాతం మంది మాత్రమే రుణాలు పెరిగాయని సర్వే తన ప్రకటనలో పేర్కొంది. అయితే, మిలీనియల్స్ సవాళ్లను అధిగమిస్తూ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనలో చురుగ్గా ఉండే అవకాశముందని సర్వే వెల్లడించింది. భారత్‌లో దాదాపు సగం(48 శాతం) మిలీనియల్స్ కొత్త కారు లేదా ఇల్లు లాంటి వాటిని కొనుగోలుకు చేసేందుకు వారి సేవింగ్స్‌ని వాడుతున్నారని సర్వేలో స్పష్టమైంది.

ఈ అంశంలో 45 ఏళ్లు పైబడిన వారు 28 శాతం మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా 39 శాతం మంది మిలీనియల్స్ మెరుగైన పెట్టుబడుల కోసం చూస్తుండగా, 45 ఏళ్లు పైబడిన వారిలో మెరుగైన పెట్టుబడులు పెట్టేవారు 26 శాతం మంది మాత్రమే ఉన్నారు. ‘కరోనా సంక్షోభం మిలీనియల్స్‌కు ఆర్థిక మేలుకొలుపునకు పిలుపు. డబ్బు నిర్వహణపై అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలానికి ఆదా చేయడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం, మెరుగైన పెట్టుబడుల అవగాహన పెరిగిందని’ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ కుషల్ రాయ్ చెప్పారు.

Tags:    

Similar News