10 వేలకు చేరువలో ఏపీ కరోనా కేసులు..
దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొత్త రికార్డు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో 8,987కరోనా కేసులు వెలుగుచూడగా, 35 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా చూసుకుంటే నెల్లూరు 1,347, శ్రీకాకుళం 1,344, గుంటూరులో 1,202 కేసులు, చిత్తూరు […]
దిశ,వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య కొత్త రికార్డు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో 8,987కరోనా కేసులు వెలుగుచూడగా, 35 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా చూసుకుంటే నెల్లూరు 1,347, శ్రీకాకుళం 1,344, గుంటూరులో 1,202 కేసులు, చిత్తూరు 1,063, తూర్పుగోదావరి 851, కర్నూలు 758, విశాఖలో 675 కేసులు, కృష్ణా 441, విజయనగరం 380, ప్రకాశం 305, కడప 297, అనంతపురం 275 కేసులు వెలుగుచూశాయి.