‘రైతులను ఆదుకునేందుకు నూతన ప్రణాళికలు’
దిశ, నల్లగొండ: సూర్యాపేట సమీపంలోని గాంధీనగర్ లయోలా పాఠశాలలో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈ నెల 27 నుంచి మూతపడుతుందని ఎన్‌డీసీఎంస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందునా రైతులు ఈ నెల 26 వరకు […]
దిశ, నల్లగొండ: సూర్యాపేట సమీపంలోని గాంధీనగర్ లయోలా పాఠశాలలో పీఏసీఎస్, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఈ నెల 27 నుంచి మూతపడుతుందని ఎన్‌డీసీఎంస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. శనివారం ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ నూతన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నందునా రైతులు ఈ నెల 26 వరకు ధాన్యాన్ని తీసుకువచ్చి 27న కాంటాలు వేయించుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డీఎం పెండెం సునీత, సిబ్బంది, రైతులు ఉన్నారు.