సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం
దిశ, వెబ్డెస్క్ : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజున స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆలయం లోపలే వేడుకలు జరుగుతున్నందున స్వర్ణ రథోత్సవానికి బదులు సర్వ భూపాల వాహ సేవ నిర్వహించారు. సర్వభూపాలుడు అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. సర్వ భూపాలురూ స్వామివారిని తమ భుజస్కంధాలపై మోస్తున్నారు. కాగా, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనసేవ జరుగనుంది.