దేశంలో జికా వైరస్ కలకలం..పూణేలో ఇద్దరికి పాజిటివ్

దేశంలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు సహా అతని 15ఏళ్ల కుమార్తెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల డాక్టర్ కి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి.

Update: 2024-06-26 16:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జికా వైరస్ కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు సహా అతని 15ఏళ్ల కుమార్తెకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల డాక్టర్ కి జ్వరం, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరాడు. కొద్ది రోజుల చికిత్స అనంతరం అతని బ్లడ్ శాంపిల్స్ పూణె నగరంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఈ నెల 21న రిపోర్టులు రాగా జికా వైరల్ పాజిటివ్ గా తేలినట్టు పూణే ఆరోగ్యాధికారులు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా..ఆయన కుమార్తెకు పాజిటివ్ వచ్చింది. అయితే వీరిద్దరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ కేసు వెలుగు చూసిన ఎరంద్‌వానే ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని నియంత్రిచడానికి చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు.

కాగా, జికా వైరస్ సోకిన వారికి జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి మనుషులకు సోకుతుంది. దీనిని మొదటగా 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత వివిధ దేశాల్లో వ్యాప్తి చెందింది.


Similar News